Reading Time: < 1 minute

హైదరాబాద్,
06-03-2026

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గద్దల రమేష్ హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఎస్సీ విభాగ జాతీయ అధ్యక్షులు రాజేంద్రపాల్ గౌతమ్, ఎస్సీ విభాగం జాతీయ కోఆర్డినేటర్ మరియు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దల రమేష్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభివాదాలు తెలిపారు.

సమావేశంలో గద్దల రమేష్ మాట్లాడుతూ, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఈ నెల మార్చి 12న హైదరాబాద్ గాంధీభవన్‌లో పదవీ స్వీకారం చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరవనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.