భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మండలంలోని ZPHS సులానగర్ పాఠశాలలో మండల స్థాయి బాలా మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దేవదాసు, గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హాథీరామ్ నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
మండలంలోని ఆరు కాంప్లెక్స్‌ల పరిధిలో గత వారం పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో తెలుగు, గణితం, ఇంగ్లీష్ మరియు స్టోరీ టెల్లింగ్ (తెలుగు, ఇంగ్లీష్) విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మండల స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రతి కాంప్లెక్స్ నుంచి ఆయా సబ్జెక్టుల్లో ఐదుగురు, స్టోరీ టెల్లింగ్‌లో ఐదుగురు చొప్పున పాల్గొన్నారు.
ఈ పోటీల నిర్వహణలో ఆర్‌పీలుగా వి. రమేష్ బాబు, మంగీలాల్, సారయ్య, విష్ణు ప్రియ రాథోడ్, వెంకట్రామ్, పూల్ సింగ్ వ్యవహరించారు. మొత్తం 30 మంది విద్యార్థులు సబ్జెక్ట్ పోటీల్లో, 30 మంది స్టోరీ టెల్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల అనంతరం ప్రతి తరగతి నుంచి ఒక్కరు చొప్పున ఐదుగురు విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





