భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఖాసిం పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు, శ్రీ వెంకటేశ్వర కళా నాట్యమండలి అధ్యక్షుడు జూనియర్ గద్దర్ భాషా ఆధ్వర్యంలో పాల్వంచ ఎస్సై కళ్యాణి కస్తూరి ప్రశాంతిను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు.
ఈ సందర్భంగా మహిళల సేవలను కొనియాడుతూ స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ సేవలు అందిస్తున్నారని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఖాసిం భాషా, రిపోర్టర్ సంతోష్, కృష్ణ, నిమ్మల రాంబాబు, అలీ వెంకట్, రామారావు, వెంకన్న, నాగరాజు, పుట్టబాబు, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





