భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
15-03-2026
పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసగిరి కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవం భక్తి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రివర్యులను ఆలయ అర్చకులు, నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం మంత్రులు ఇద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు.
కళ్యాణ మహోత్సవాన్ని భక్తులతో కలిసి వీక్షించిన మంత్రులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసగిరి గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీశాఖ సహకారంతో ఈ ప్రాంతాన్ని ఈకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి భావం, ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్
- శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానం
- పాల్వంచలో మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సైకు సన్మానం
- భద్రాచలం ఐటిడిఏలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభం
- జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు









