భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
స్థానిక నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తాటాకుల కళాకృతుల శిక్షకురాలు అమ్ముద మహిళలతో తన అనుభవాలను పంచుకుని స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథి సునీత మాట్లాడుతూ మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించి గౌరవించేందుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. మహిళల సాధికారత కోసం నవ లిమిటెడ్ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు.
అలాగే ఎస్బీఐ క్యాషియర్ శ్రీమతి సింధు మాట్లాడుతూ మహిళలు ఈ కేంద్రం ద్వారా అందుతున్న శిక్షణలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
కార్యక్రమంలో మహిళా అతిథులను సన్మానించి, మహిళా సాధికార కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి (డిప్యూటీ మేనేజర్, ఎస్బీఐ), మహిళా సాధికార సిబ్బంది టీ. అరుణ, అమ్ముద, అరుణ, కవిత, దివ్య మరియు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





