Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: KTPS 5,6 దశల చీఫ్ ఇంజనీర్ ఎం. ప్రభాకర్ రావు ను TRVKS జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన డైరీ మరియు క్యాలెండర్ ను అందజేశారు.

సమావేశంలో O&M సిబ్బందికి ఇన్‌చార్జ్ ప్రమోషన్లు ఇవ్వాలని ప్రతినిధులు చీఫ్ ఇంజనీర్‌ను కోరారు. దీనికి స్పందించిన చీఫ్ ఇంజనీర్, డోజర్ ఆపరేటర్లకు విల్లింగ్‌నెస్ కాల్ రేపటిలోగా జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే FM/Gr-I పోస్టుకు సంబంధించిన క్లారిఫికేషన్ కోసం TG GENCO హెడ్ క్వార్టర్స్, హైదరాబాద్‌కు లేఖ పంపినట్లు వెల్లడించారు.

అనంతరం ప్రతినిధులు SE/A&P శివ బాల్ రెడ్డి, Dy. CCA పి. రామారావు, DGM (HR) పి.వి. శ్రీనివాస్ మూర్తి లను కూడా కలిసి డైరీలు మరియు క్యాలెండర్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దంచనాల రాంబాబు, పాశం రవిబాబు, KTPS 5,6 దశల రీజనల్ అధ్యక్షుడు కురిమెళ్ళ రవికుమార్, కార్యదర్శి ఎం.డి. సుభాని, వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మరాజుల నాగేశ్వరరావు, కోశాధికారి పప్పు విజయశంకర్, బ్రాంచ్ నాయకులు పఠాన్ ఖాన్, మహేందర్, ఖమ్మం శ్రీను, అలాగే ఇతర నాయకులు మరియు ఆర్టిజన్ ప్రతినిధులు పాల్గొన్నారు.