Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
05-03-2026

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి 45వ వార్డు కార్పొరేటర్ నరేష్, గౌరవ డిప్యూటీ మేయర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్లు కలిసి మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధి కోసం అందరూ ఒక టీమ్‌లా కలిసి పనిచేయాలని, కార్పొరేషన్‌ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నారు.

అలాగే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేయర్‌తో సమన్వయంతో ముందుకు సాగాలని సంకల్పించారు.