భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని జామా మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తున్నాయని అన్నారు. రంజాన్ పండుగ క్రమశిక్షణ, దాతృత్వం మరియు పరస్పర సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జీవించడం మన దేశ గొప్పతనమని, ఈ పవిత్ర మాసం అందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, 3టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, మైనార్టీ సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





