Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
07-03-2026

కొత్తగూడెం నెహ్రూ బస్తి ప్రాంతంలో వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో ఐదుగురు నిందితులను కొత్తగూడెం 1టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 4వ తేదీన నెహ్రూ బస్తి రైల్వే పట్టాల సమీపంలో కిరాణా దుకాణం వద్ద స్నేహితుడితో మాట్లాడుతున్న నరేష్ కోరి (40)పై నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, వసుకుల ఉదయ్, నాతరి రాజేశ్వరరావు @ ఐలయ్య దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. రోకలి బండతో తలపై బలంగా దాడి చేయడంతో నరేష్ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. అతన్ని చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇంటి వివాదం కారణంగా నరేష్ నిర్మల అనే మహిళకు మద్దతుగా నిలవడంతో కక్ష పెంచుకుని ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు 1టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ వెల్లడించారు.