నేటి ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిడి వంటి కారణాలే దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
వైద్యుల ప్రకారం, అధిక రక్తపోటు ఒక నిశ్శబ్ద వ్యాధి. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే దీన్ని అదుపులో పెట్టుకోకపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాపాయకర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎందుకు వస్తుంది?
వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఫాస్ట్ ఫుడ్, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం మానసిక ఒత్తిడి, టెన్షన్ఎ క్కువసేపు కూర్చుని పని చేయడం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటి కారణాలు అధిక రక్తపోటుకు ప్రధానంగా దారితీస్తున్నాయి.
అధిక రక్తపోటు లక్షణాలు
అధిక రక్తపోటు ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు… తరచుగా తలనొప్పి, తల భారంగా అనిపించడం, తల తిరగడం, అనవసర భయం లేదా ఆందోళన, అప్పుడప్పుడు చూపు మసకబారడం, అలసట, విశ్రాంతి లేకపోవడం.
ఎలా నియంత్రించాలి?
అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.
రోజుకు 5 గ్రాములకంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ప్రతిరోజూ నడక లేదా వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. సరిపడా నిద్ర తీసుకోవాలి, బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
ప్రారంభ దశలోనే రక్తపోటును గుర్తించి నియంత్రించుకుంటే, భవిష్యత్తులో వచ్చే తీవ్ర ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మలReading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ15-03-2026 పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసగిరి కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవం భక్తి వైభవంగా… Read more: పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీReading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో శిక్షణ… Read more: పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా14-03-2026 భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) సంస్థల సహకారం… Read more: శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా14-03-2026 జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి వార్షిక పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం పాల్వంచ… Read more: పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా14-03-2026 జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గ్యాస్… Read more: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్
- శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానంReading Time: < 1 minuteహైదరాబాద్,14-03-2026 రాబోయే మార్చి 27న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన… Read more: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానం
- పాల్వంచలో మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సైకు సన్మానంReading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఖాసిం పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు,… Read more: పాల్వంచలో మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సైకు సన్మానం
- భద్రాచలం ఐటిడిఏలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభంReading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం07-03-2026 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా భద్రాచలం ఐటిడిఏలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు.… Read more: భద్రాచలం ఐటిడిఏలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభం
- జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలుReading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి… Read more: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు









