భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
07-03-2026
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి విద్య అత్యంత కీలకమని, విద్యావంతురాలైన మహిళ అన్ని రంగాల్లో ప్రతిభ చూపి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిలో చాలా పథకాలు మహిళల పేరుమీదే మంజూరు అవుతున్నాయని తెలిపారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మాట్లాడుతూ మహిళలపై లింగ వివక్ష తొలగింపు కుటుంబ వ్యవస్థ నుంచే ప్రారంభం కావాలని సూచించారు. పనిచేసే మహిళలపై వేధింపులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి స్వర్ణలత లెనినా మాట్లాడుతూ మహిళల సాధికారతకు విద్య, అవగాహన, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని పేర్కొన్నారు. “బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం ద్వారా బాలికల విద్య, భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా కార్పొరేటర్లు, సర్పంచులు, ఉపసర్పంచులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, వివిధ శాఖల మహిళా అధికారులు, కార్పొరేటర్లు, మహిళా సర్పంచులు, ఉపసర్పంచులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





