Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
05-03-2026:

నిరుద్యోగులైన గిరిజన యువతీ, యువకులు జీవితంలో స్థిరపడేందుకు ఐటిడీఏ వైటీసీ లో 60 రోజులపాటు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ కోర్స్ శిక్షణ పూర్తి చేశారు. ఈ శిక్షణ పూర్తికానైన తర్వాత ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ గురువారం తన ఛాంబర్‌లో యువతీ–యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా బి. రాహుల్ మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న పాఠాలను సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పెంపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం సచేందర్ మరియు డీమార్ట్ కంపెనీలు యువతీ–యువకులకు ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయని, కష్టపడి పనిచేస్తే మంచి పేరు సంపాదించవచ్చని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందకపోతే కూడా, కంపెనీలలో పని చేస్తే అనుభవం వస్తుందని సూచించారు.

భవిష్యత్తులో గిరిజన యువత–యువకులు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందేందుకు ఐటిడీఏ ద్వారా సహాయ–సహకారాలు అందిస్తామని.

ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ, శిక్షకురాలు భవాని, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మహేష్, వార్డెన్ దీనాకుమారి, గిరిజన యువత–యువకులు తదితరులు పాల్గొన్నారు.