భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, గ్రంథాలయ కార్యదర్శి కే. కరణ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొల్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్పనా చౌదరి మాట్లాడుతూ మహిళలు నేడు అనేక రంగాలలో ముందంజలో ఉన్నారని, భవిష్యత్తులో కూడా అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలను సాధించాలని ఆకాంక్షించారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఆఫీస్ ఇన్చార్జి ఎం. నవీన్ కుమార్, గ్రంథపాలకురాలు జీ. మణిమృదుల, గ్రంథపాలకులు వాణి, రుక్మిణి, గీత, విద్యార్థినీ విద్యార్థులు మరియు పాఠకులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





