Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
07-03-2026

జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్రధాన కార్యాలయంలో సింగరేణి సీఎండీ డా. జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలు, సింగరేణి సంస్థతో పరస్పర సహకారం ద్వారా చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వ శాఖలు మరియు సింగరేణి మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ భేటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ కూడా పాల్గొన్నారు.