భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
05-03-2026
రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు ధనసరి అనసూయ (సీతక్క) అధ్యక్షతన, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ పై వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించబడింది.
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ ప్రతి జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలను ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
99 రోజుల కార్యాచరణ ముఖ్యాంశాలు:
మార్చి 6–15: పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్
మార్చి 16–31: ఆదాయ పెంపుదల (Tax Collection) కార్యక్రమాలు
ఏప్రిల్ 1–15: తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు
ఏప్రిల్ 16–30: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు
మే 1–15: ఉపాధి హామీ పథకం పనుల అమలు
మే 16–31: వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి అవగాహన కార్యక్రమాలు
మంత్రివర్యులు అధికారులకు జిల్లా, మండల, గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించాలనేది ప్రత్యేకంగా ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి DRDA పీడీ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీపీఓ సుధీర్ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





