హైదరాబాద్,
14-03-2026
రాబోయే మార్చి 27న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సేవలు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిను దేవస్థానం అధికారులు ఆహ్వానించారు.
హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి దేవస్థానం ఈవో దామోదర్తో పాటు ఆలయ అర్చకుల బృందం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణలతో మంత్రి వాకిటి శ్రీహరి దంపతులను ఆశీర్వదించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక వేడుక అని ఆలయ అధికారులు తెలిపారు.
ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి భద్రాచలం శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధానార్చకులు శ్రీనివాస రామానుజం, రామాయణం పారాయణుడు అంతర్వేది కృష్ణమాచార్య, AEO భవానీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్
- శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానం
- పాల్వంచలో మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సైకు సన్మానం
- భద్రాచలం ఐటిడిఏలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభం
- జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు









