భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
07-03-2026
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా భద్రాచలం ఐటిడిఏలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అధికారులు, సిబ్బందితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐటిడిఏ చిల్డ్రన్స్ పార్క్, పరిసర ప్రాంతాలు, ఐటిడిఏ కార్యాలయ వెనుక భాగం మరియు నివాస గృహాల ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి పచ్చదనం–పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా డేవిడ్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుధ్యం, అసంపూర్ణ నిర్మాణ పనుల పూర్తి, పనికిరాని వస్తువుల తొలగింపు వంటి పనులు వేగవంతం అవుతాయని అన్నారు. ప్రతి విభాగాన్ని పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు.
అలాగే ఐటిడిఏ ప్రాంగణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో సీడీపీవో జ్యోతి ఆధ్వర్యంలో సూపర్వైజర్లు, సిబ్బంది కలిసి పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఏవో సున్నం రాంబాబు, ఏసీఎంఓ రమేష్, ఏపీవో పవర్ వేణు, పివిటిజీ అధికారి గన్యా, మేనేజర్ ఆదినారాయణ, ఐసిడిఎస్ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





