భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ డా. ఎన్. కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్యూటీషన్, టైలరింగ్, ఆఫీస్ ఆటోమేషన్ మరియు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయన చేతుల మీదుగా యోగ్యత పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా బ్యూటీషన్ కోర్సు పూర్తి చేసిన ఆర్. నందిని మాట్లాడుతూ మహిళా సాధికార కేంద్రం ద్వారా ఉచిత శిక్షణ పొందడం వల్ల తమలాంటి మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో దుస్తుల తయారీ, తాటాకుల బుట్టల తయారీ ద్వారా సంపాదించిన ₹1,07,641 విలువైన చెక్కులను కూడా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా డా. కిషోర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. మహిళా సాధికార కేంద్ర ప్రతినిధి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 4,600 మందికి పైగా మహిళలు శిక్షణ పొందారని, వారిలో సుమారు 75 శాతం మంది స్వయం ఉపాధి ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, ఏ. శ్రీనివాస్ రెడ్డి, డీజీఎం (హెచ్ఆర్ & ఏ) అధికారులు, అలాగే మహిళా సాధికార కేంద్ర సిబ్బంది ఆముద, టి. అరుణ, బి. అరుణ, కవిత, దివ్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్
- శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానం
- పాల్వంచలో మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సైకు సన్మానం
- భద్రాచలం ఐటిడిఏలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభం
- జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు









