Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం,
07-03-2026

ప్రభుత్వ మరియు ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ మిల్టన్ ఆధ్వర్యంలో ప్రయోగశాలలు, తరగతి గదులు, అధ్యాపకుల గదులు, గ్రంథాలయం తదితర ప్రాంతాలను ఎన్‌ఎస్ఎస్ విద్యార్థులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది కలిసి శుభ్రపరిచారు.

ఈ సందర్భంగా కళాశాలలో ఉపయోగం లేని పరికరాలు, వస్తువులను తొలగించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కళాశాల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత ప్రాముఖ్యతను గుర్తించి విద్యార్థులు వాలంటీర్లుగా ముందుండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్ఎస్ విభాగాధిపతులు డాక్టర్ కిరణ్ కుమార్, బి. సుధాకర్ రావు, విభాగాధిపతులు హవీలా, డాక్టర్ శ్రీను, డాక్టర్ రాగసుమ, ఎన్. హిమజ, డాక్టర్ నాగ సమీరా, వెంకటకృష్ణ మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.