భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ,
07-03-2026
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాల్వంచ పట్టణంలోని 4వ డివిజన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం నర్సింగ్ సిబ్బంది, కాలనీలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టిజన్ మహిళలను ఘనంగా సన్మానించారు.
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ప్రజలకు ఆరోగ్య, పారిశుధ్య సేవలు అందిస్తూ కష్టపడుతున్న మహిళలను అభినందిస్తూ వారికి శాలువాలు, పూలదండలు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, తమ సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు, నాయకులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





