భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
05-03-2026
జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ గురువారం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించారు. ఈ తనిఖీ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.
తనిఖీ సందర్భంగా కలెక్టర్ ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉంచిన గదులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనివారిని లోపలికి అనుమతించరాదు అని సెక్యూరిటీ గార్డులకు ఆదేశించారు. తనిఖీ పూర్తయిన తరువాత గోడౌన్ రిజిస్టర్లను సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం తాసిల్దార్ పుల్లయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, డీఎల్‌ఎంటీ సాయికృష్ణ, బీజేపీ నోములు రమేష్, కాంగ్రెస్ పార్టీ జయ శ్రీలక్ష్మి, హమ్ ఆప్ ది పార్టీ రాంబాబు, సిపిఎం ఎల్ బాలరాజు, మరియు ఇతర ఎన్నికల సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





