భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
04-03-2026
నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆదివాసి యువకుడు పూణెం హరీష్ పట్టుదల, ఏకాగ్రతతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి యూనివర్సిటీ ఆఫ్ న్యూఢిల్లీలో ఎల్ఎల్బి కోర్స్ సీటు సంపాదించాడు.
ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ మాట్లాడుతూ, పూణెం హరీష్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచినందుకు గర్వంగా ఉందని చెప్పారు. పూణెం హరీష్ చదివిన పాఠశాలలు మరియు కళాశాలలు.
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, గంగారం ఇంటర్మీడియట్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఖమ్మం డిగ్రీ గౌట్ డిగ్రీ కాలేజ్, ఖైరతాబాద్ హరీష్ లా కోర్స్ కోసం ఐటిడిఎ ద్వారా తండ్రికి ₹30,000 ప్రోత్సాహక చెల్లింపు అందించబడింది. బి.రాహుల్ తండ్రిని అభినందించి, తన ప్రతిభను తోటి విద్యార్థులకు తెలియజేసి చదువులో మక్కువ కలిగేలా చూడమని సూచించారు. అలాగే తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా నెలవారీ కొంత ఆర్థిక వెసులు బాటు చేసుకోవాలని సూచన ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రాజ్, విద్యార్థి తండ్రి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





